BREAKING NEWSCRIME
మొహరం సందర్భంగా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు
మొహరం సందర్భంగా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు
వెల్దుర్తి ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి
వెల్దుర్తి, జూలై 28, (సీమకిరణం న్యూస్) :
మొహరం సందర్భంగా ఆకతాయిలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం మొహరం పండగ ముగియడంతో ప్రశాంతంగా మొహరం వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. పాత కక్షాలను మనసులో ఉంచుకొని గలాటాలకు పాల్పడిన, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వృద్ధుల పట్ల మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు. పాత కక్షలు మనసులో ఉంచుకొని ఉత్సవంలో గలాటాలకి దిగితే కేసులు బనా ఇస్తామని అన్నారు. మొహరం వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.