డెంగ్యూ వ్యాధి లక్షణాలకు భయపడకండి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
ప్రభుత్వ వైద్యశాలలోని సేవలను వినియోగించుకోండి
డాక్టర్ ఎం బాలచంద్రారెడ్డి
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, జులై 28, (సీమకిరణం న్యూస్) :
సీజనల్ వ్యాధుల్లో భాగంగా డెంగ్యూ వ్యాధి లక్షణాలు సోకిన అధైర్య పడకూడదని వెల్దుర్తి వైద్యశాల సూపరిండెంట్ బాలచంద్రారెడ్డి సూచించారు. ఇందులో భాగంగా సీజనల్ వ్యాధులు పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రోగులకు సూచనలు ఇచ్చారు. శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు పాత్రికేయులతో మాట్లాడుతూ వెల్దుర్తి మండల పరిధిలోని గ్రామాలలో ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని తెలిపారు ప్రభుత్వం కోట్లు వెచ్చించి ప్రజలకు సేవ చేసేందుకు నూతన ప్రభుత్వ వైద్యశాలను నిర్మించి వెల్దుర్తి మండల ప్రజలకు ఎంతో సేవలు చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు వైద్య పరంగా మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రి రూప్రేఖలు తీర్చిదిద్ది మెరుగైన వైద్యం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సేవలను వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్సి నుండి సిహెచ్సిసి వరకు ఏర్పాటు చేసి 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం పట్ల వెల్దుర్తి మండల ప్రజలు చేసుకున్న పుణ్యమని తెలపడం జరిగింది. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉంటున్నారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాల సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు. నాలుగు ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దోమలు వృద్ధి చెంది వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వెల్దుర్తి వైద్యశాల నందు అన్ని వసతులు కూడుకొని ఉన్నాయని తెలిపారు ఇక్కడ రోగులకు నయంగానే పక్షంలో మెరుగైన వైద్య సేవల కోసం కర్నూలుకు సిఫారసు చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఆశా వర్కర్లు గ్రామాలలో రోగులకు ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ వైద్యశాలకు రోగులను పంపే విధంగా వారికి తెలపడం జరిగిందని అన్నారు. ఈ వైద్యశాల నందు పాముకాటుకు, కుక్క కాటుకు మందులు సౌకర్యంగా ఉన్నాయని తెలిపారు వీధి పట్ల అధైర్య పడకుండా ట్రీట్మెంట్ తీసుకుని రోగాలను నయం చేసుకోవాల్సిందిగా డాక్టర్లు కోరుతున్నారు.