
వైసీపీ పాలనలో ఉద్యోగులు సంతోషంగా లేరు
ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్
విజయవాడ, జూలై 28, (సీమకిరణం న్యూస్) :
వైసీపీ పాలనలో ఉద్యోగులు సంతోషంగా లేరని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీఎన్జీవో మహాసభల పోస్టర్‌ను బండి శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 21, 22 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహాసభలకు ముఖ్యమంత్రి జగన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, కేబినెట్ సబ్‌కమిటీ సభ్యులైన మంత్రులను కూడా ఆహ్వానించామని తెలిపారు. గతంలో ఉద్యోగుల మహాసభలకు సీఎంలు వచ్చినప్పుడు మేలు జరిగిందని, ఇప్పుడూ మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలకు సీఎం పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగుల సంఘం నేత శివారెడ్డి మాట్లాడుతూ మా డిమాండ్లను సీఎం జగన్ ముందుంచుతాం. 71 డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. పీఆర్‌సీ బకాయిలు, సరెండర్ లీవులు, ఈఎల్ ఎన్‌క్యాష్ మెంట్ ఇవ్వాలని వివరించారు.