
నవ సమాజ నిర్మాణానికే హార్ట్ ఫౌండేషన్ ఏర్పాటు
-: యువతలో క్రమంగా పెరుగుతున్న హుద్రోగుల సంఖ్య
-: 21 ఏళ్లుగా హృద్రోగ విభాగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ అవార్డు అందజేత
-: హార్ట్ ఫౌండేషన్ సెక్రెటరీ సీనియర్ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్
కర్నూలు టౌన్, సెప్టెంబర్ 27, (సీమకిరణం న్యూస్) :
నవ సమాజ నిర్మాణానికే ” కర్నూలు హార్ట్ ఫౌండేషన్” ఏర్పాటు చేయడం జరిగిందని
హార్ట్ ఫౌండేషన్ సెక్రటరీ సీని యర్ కార్డియాలజిస్ట్ డా. చంద్ర శేఖర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ” కర్నూలు హార్ట్ ఫౌండేషన్” ప్రాంగణంలో డా. భవాని ప్రసాద్, కల్కూర చంద్రశేఖర్ లతో కలిసి డాక్టర్ చంద్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్
మాట్లాడుతూ 1997లో కర్నూలుకు రావడం జరిగిందన్నారు.
2002 సెప్టెంబర్ 2న హార్ట్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం “ఆరోగ్య విద్య” ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫౌండేషన్ ఏర్పాటుకు నాటి కలెక్టర్ సాయి ప్రసాద్ అధ్యక్షులుగా పనిచేశారు. నాటి నుండి నేటి వరకు ఫౌండేషన్ సెక్రటరీగా తాను కొనసాగుతున్నట్లు తెలిపారు. 2003 నుండి ” ప్రపంచ హుద్రోగుల దినోత్సవం” వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ హృద్రోహుల సంస్థ జెనీవాలో 1946లో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వేడుకలు 2000 సంవత్సరం నుండి ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు పైగా పాల్గొంటున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 29న గుండె జబ్బుల పై అవగాహన, సెమినార్లు, నడక, వంటి నినాదంతో ప్రతి సంవత్సరం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. “Use Heart. No your Heart” అనే కొత్త నినాదంతో ఈ వేడుకలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 21 ఏళ్లుగా హృద్రోగ విభాగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ అవార్డు అందిస్తున్నట్లు తెలిపారు. మొదటి సారిగా డా. హెగ్డే కు ప్రధానం చేసినట్లు వెల్లడించారు. ఈనెల 29న డా.జార్జ్ జోసఫ్ కు ప్రధానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
2012 నుండి ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం అవగాహన కార్యక్రమం, ప్రతి ఏటా ప్రపంచ హృద్రోగుల దినోత్సవ వేడుకలు కొనసాగిస్తున్నట్లు డా. చంద్ర శేఖర్ వెల్లడించారు. కార్య క్రమంలో భాగంగా సాంస్కృతిక, కూచిపూడి, మిమిక్రీ తో పాటు నారాయణ కుమారులచే సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులు గా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఫౌండేషన్ అధ్యక్షులు డా. సృజన, ఎస్పీ కృష్ణకాంత్, ఫౌండేషన్ సభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు.
ఫౌండేషన్ ఏర్పాటుకు టీజీ వెంకటేష్ కృషి మరువ లేనిది
ఫౌండేషన్ నిర్మాణ అభివృద్ధికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ దాదాపు రూ. కొటి సహకారం అందించారన్నారు.
2011లో పతంజలి యోగ హాలుతో ప్రారంభం కాగా, 2012లో జిమ్ పరికరాలు ఏర్పాటుతో పాటు, మిగిలిన భవన నిర్మాణం పూర్తి చేసి నట్లు తెలిపారు. గతేడాది మరింత సౌకర్యంగా ఉండేందుకు వీలుగా రూ.25 లక్షలు మంజూరు చేశారన్నారు. లిఫ్ట్ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే జిమ్ము కేంద్రంలో నూతన పరికరాల ఏర్పాటుకు మరొకసారి టీజీ నిధులు సమ కూర్చినట్లు డాక్టర్ చంద్రశేఖర్
తెలిపారు.
త్వరలో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తాం
– డాక్టర్ చంద్రశేఖర్
కర్నూలు నగరంలోని జర్నలిస్టుల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగా హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు
డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.