ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
27న కల్లూరు మండలంలో స్పందన కార్యక్రమం
27న కల్లూరు మండలంలో స్పందన కార్యక్రమం
జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
కర్నూలు టౌన్, అక్టోబర్ 26, (సీమకిరణం న్యూస్) :
ఈనెల 27 వ తేదీన కల్లూరు మండల కేంద్రం లో జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు ఎంపిడిఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరిస్తామని, ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.