
-: మొదటిసారి కెపా ఐవీఎం ఉపయోగం
-: ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి
కర్నూలు టౌన్, అక్టోబర్ 27, (సీమకిరణం న్యూస్) :
అధునాతన చికిత్సతో విజయవంతంగా కర్నూలులో ఒయాసిస్ ఫెర్టిలిటీలో కెపా (సీఏపీఏ) ఐవీఎం ద్వారా ఓ జంట గర్భం దాల్చడం చాలా ఆనందంగా ఉందని ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక గాయత్రి ఎస్టేట్ లోని ఒయాసిస్ ఫెర్టిలిటీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి తక్కువ కేంద్రాల్లో అత్యాధునిక ఐవీఎం చికిత్స అందుబాటులో ఉందన్నారు. సాధారణ ఐవీఎఫ్ చికిత్స సమయంలో 10 నుంచి 12 రోజుల వరకు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గుడ్లు రెండు సెంటీమీటర్ల పరిమాణంలోకి వచ్చిన తరువాత గుడ్డులోకి స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేస్తామన్నారు. కానీ కెపా ఐవీ ఎంలో రెండు నుంచి మూడు ఇంజెక్షన్లు ఇస్తే సరిపోతుందన్నారు. దీనిని డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ అని కూడా పిలుస్తారని పేర్కొ న్నారు. అత్యాధునిక సాంకేతికతతో మాతృత్వాన్ని సాధించ డానికి సురక్షితమైనదన్నారు. ఇది అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదని సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. కెపా ఐవీఎం అనేది పీసీవోఎస్, రెసిస్టెంట్ ఓవరీ సిం డ్రోమ్, ఓసైట్ మెచ్యూరేషన్ సమస్యలు, థ్రోంబోఫిలియా, క్యాన్సర్ ఉన్న స్త్రీలతో సహా కొంతమందికి ఇది ఒక ఆశాకిరణం అన్నారు. వంధ్యత్వానికి ఐవీఎఫ్ మాత్రమే చికిత్సకాదని, అనేక ఇతర చికిత్సలు కూడా ఉన్నాయన్నారు. సంతానం ఆశను వదులుకున్న ఒక జంట కర్నూలులోని ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించారని చెప్పారు. ఇప్పటికే ఆ మహిళ గత కొన్నేళ్లుగా శారీరక, మానసిక వేదనను అనుభవించినందున కెపా ఐవీఎం అందించాలని నిర్ణయించామన్నారు. ఐయూఐ, ఐవీఎఫ్ వద్ద అనేక ప్రయత్నాలు విఫలం అయినందున అధునాతన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో కొన్ని ఇంజెక్షన్లు మాత్రమే ఉపయోగించనున్నామని తెలిపారు.
ఇది ఓహెచ్ఎస్ఎస్ (ఓవేరి యన్ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్) ఎటువంటి దుష్ప్ర భావాలు లేనిదన్నారు. కెపా ఐవీఎంలో సంప్రదాయ ఐవీఎఫ్ కి విరుద్ధంగా కేవలం రెండు లేదా మూడు ఇంజెక్షన్లతో మహిళల నుంచి అపరిపక్వ గుడ్లు తిరిగి పొందవచ్చన్నారు. ఇందులో పరిపక్వ గుడ్లను తిరిగి పొందడానికి అనేక ఇంజెక్షన్లు ఉపయోగించబడతాయన్నారు. ఈ అపరిపక్వ గుడ్లు ప్రయోగశాలలో పరి పక్వం చెందడానికి అనుమతించబడతాయని తెలిపారు. తర్వాత ఇవి స్పెర్మ్‌తో కలిసి పోతాయన్నారు. ఫలితంగా పిండం ఏర్పడుతుందన్నారు. అందువల్ల ఈ చికిత్స రోగికి అనుకూలo, సురక్షితమైనదని తెలిపారు. ఓసైట్స్ (గుడ్లు) పరిపక్వతకు రెండు దశలు కలవన్నారు. అవి ఒకటి ఓసైట్లు 24 గంటల ప్రీమెచ్యూరేషన్ స్టెప్‌లో కల్చర్ చేయబడతాయని, రెండోది ఓసైట్లు 30 గంటల పరిపక్వ దశలో కల్చర్ చేయబడతాయని తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ కో ఫౌండర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జీ రావు, ఒయాసిస్ ఫెర్టిలిటీకి సైంటిఫిక్ హెడ్, క్లినికల్ ఎంబ్రి యాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మార్గదర్శకత్వంలో ఇది సాధ్యమైనదన్నారు.