ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATETELANGANA

రెడ్డి నీ బుద్ధి మానుకో..!

రెడ్డి నీ బుద్ధి మానుకో..!

-: బెల్లయ్య నాయక్ కు టికెట్ ఇవ్వకపోతే తమ జాతి సత్తా చూపుతాం

-: లంబాడి హక్కుల పోరాట సమితి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్

కర్నూలు టౌన్, అక్టోబర్ 29, (సీమకిరణం న్యూస్):

 

రెడ్డి నీ బుద్ధి మార్చుకోకపోతే ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో తమ జాతి నాయకుడు బెల్లయ్య నాయక్ కు పార్టీ టికెట్ ఇవ్వకపోతే, మీ పార్టీకి ఓటు అనే ఆయుధంతో తాము ఏమిటో నిరూపించుకుంటామని లంబాడి హక్కుల పోరాట సమితి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఏపీ ముఖ్య నాయ కుల సమావేశం కర్నూలు జిల్లా అధ్యక్షులు కేతావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల హడావిడి మొదలైంది అన్నారు. అన్ని పార్టీలు అందుకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించి సంబరాలు చేసుకుంటున్నా రన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం తన స్వార్థం కోసం పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు పనిచేసిన లంబాడి బిడ్డలకు టిక్కెట్టు కేటాయించక పోవడం బాధాకరమన్నారు. సీట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను తాము ఖండిస్తున్నామన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అయిన ఆయనకు హామీ ఇచ్చి న మహబూబాబాద్ సీటును ఇతరులకు కేటాయించడం మీకు తగునా అని సూటిగా ప్రశ్నించారు. నాయక్ ఓ పక్క సంఘం తరపున న్యాయం చేస్తూనే.. మరోవైపు జాతీయ స్థాయిలో బంజారా లంబాడి కులాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అలుపెరుగని నాయక్ పార్టీ టికెట్ రాకుండా కుట్రలు పన్నిన రేవంత్ రెడ్డికి తప్పని సరిగా తమ జాతి తరపున తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ఈ సమావేశంలో షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ నాయకులు కాలు నాయక్, రాము నాయక్, ఎస్ టి ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్య క్షులు రామాంజనేయ నాయక్, భరత్ నాయక్, హుస్సేన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!