ఇజ్రాయిల్ దాడులను ప్రపంచ దేశాలు ఖండించాలి
పాలస్తీనాలో శాంతి స్థాపనకు కృషి చేయాలి
పాలస్తీనాలో ఇజ్రాయిల్ నరమేధాన్ని ఆపాలి
ఎస్ డి పి ఐరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్ అహ్మద్
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ ఎస్ డి పి ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
కర్నూలు టౌన్, అక్టోబర్ 30, (సీమకిరణం న్యూస్) :
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని, పాలస్తీనాలో శాంతి స్థాపనకు కృషిచేయాలని ఎస్ డి పి ఐరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ ఎస్ డి పి ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్ అహ్మద్ మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలను యుఎన్ఓ తక్షణమే ఆదుకొని వారికి న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎస్ డి పి ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిలు ఖలీల్ అహ్మద్, అమీర్ మియా, నగర అధ్యక్షుడు ఆశ్వాక్ అహ్మద్ హుస్సేన్, నగర కమిటీ సభ్యులు చాంద్ భాష, వకీల్ అహ్మద్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ గత 23 రోజులు నుండి బాంబులు వర్షం కురిపిస్తుందని, ఈ యుద్ధం లో సుమారు 10వేలకు పైగా పాలస్తీనా ప్రజలు మరణించారని, 3వేలకు పైగా చిన్నపిల్లలు చనిపోయారని, వేలాది మంది క్షతగాత్రులయ్యారని అన్నారు. నేటికి ఇజ్రాయిల్ పాలస్తీనా ఆసుపత్రిలు, పాఠశాలలు మీద బాంబు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మానవత సహాయం అందించి సంఘీభావంగా నిలవాలని, ఇజ్రాయిల్ దాడులనుప్రపంచ దేశాలు ఖండించాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇజ్రాయిల్ ఉత్పత్తులను బహిష్కరించాలని నినాదాలు చేశారు. ఇజ్రాయిల్ ఉత్పత్తులను నేలపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. చివరగా ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ జిల్లా నాయకులు ఇంతియాజ్ అహ్మద్, సలీం, షాకీర్,నగర నాయకులు అబ్దుల్లా, కార్యదర్శి జలీల్, షేక్షా, సభ్యులు షఫీ కార్యకర్తలు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.