మానవుడు దేహంలో శక్తివంతమైనవి మూత్రపిండాలే
-: మూత్రపిండ వ్యాధి నిపుణురాలు సాయివాణి
కర్నూలు టౌన్, నవంబర్ 05, (సీమకిరణం న్యూస్):
మానవుడు దేహంలో శక్తివంత మైనవి మూత్ర పిండాలేనని మూత్రపిండ వ్యాధి నిపుణురాలు సాయివాణి పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ” అమేజింగ్ కిడ్నీలు – వివిధ రకాల వ్యాధు లపై ప్రాముఖ్యత మరియు అవగాహన” సదస్సును కార్డియాలజిస్ట్, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ సెక్రెటరీ డా. చంద్ర శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మూత్ర పిండ వ్యాధి నిపుణురాలు డా. సాయి వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సి పల్ డా. భవాని ప్రసాద్ తో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.సాయి వాణి మాట్లాడుతూ మానవుని శరీరంలో అన్ని అవయవాల కంటే శక్తివంతమైనవి మూత్రపిండాలే అన్నారు.
అవి ఎంతటి పని చేస్తున్నాయో మనకు ఎవరికీ తెలియదన్నారు. మనం భుజించే ఆహారం పూర్తిస్థాయిలో జీర్ణమైన తరువాత అందులో ఏది శరీరానికి అవసరమో అది మాత్రమే ఉంచుకొని, మిగిలిన దానిని బయటికి పంపడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుత సమాజంలో ఎక్కువమంది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి అధికంగా తీసు కోవడం ద్వారా మూత్ర పిండాలపై భారం పడడంతో సరైన సమయంలో అవి పని చేయక పాటు మానవుని ఆయుస్సు ప్రమాణాలు తగ్గిపోవడం, వాటి పని సక్రమంగా నిర్వర్తించలేక ఇబ్బంది పడటం జరుగుతుందన్నారు. మానవుని శరీరంలో ఇతర అవయవాలు ఏవి పని చేయక పోయినా వాటి ప్రభావం మానవునికి తెలిసేలా చేస్తాయి. కానీ మూత్రపిండాలు అలా కాకుండా 90 శాతం వరకు భరిస్తాయి. చివరకు ఆ వ్యక్తి మరణానికి తీస్తాయని గుర్తు చేశారు. నిత్యం క్రమం తప్పని వ్యాయామం, శరీరానికి అవసరమైన చక్కటి ఆహారం తీసుకోవడం ద్వారానే మనం మూత్రపిండాలను కాపాడు కోగలమనీ డాక్టర్ సాయి వాణి స్పష్టం చేశారు. అనంతరం అతిధుల చేతులు మీదుగా డాక్టర్ సాయి వాణిని ఘనంగా సత్కరించి సన్మానించారు.