
అనాధ శరణాలయాల్లో దీపావళి వెలుగులు
-: వైసిపి జిల్లా సీనియర్ నాయకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి
కర్నూలు టౌన్, నవంబర్ 11, (సీమకిరణం న్యూస్) : నగరంలోని అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న వారందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపడానికి బాణసంచా సామాగ్రిని అందించినట్లు వైసిపి జిల్లా సీనియర్ నాయకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో అనాధ శరణాలయాలోని వారందరికీ సరిపడ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాల బీసీ జోనల్ ఇంచార్జ్ నాగరాజు యాదవ్, 49వ వార్డు కార్పొరేటర్ కృష్ణ కాంత్ రెడ్డి, 48వ వార్డు నాయకులు తబ్రేజ్ పాల్గొని అందించారు.