
ప్రభుత్వానికి మత్స్య శాఖ అధికారులకు కృతజ్ఞతలు : మండి వెంకటేశ్వరమ్మ
కర్నూలు కలెక్టరేట్ / వెల్దుర్తి , నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) : వెల్దుర్తి మండల కేంద్ర నివాసి మండి వెంకటేశ్వరమ్మ, మాది మధ్య తరగతి కుటుంబం, నా భర్త కరుణాకర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు మాకు ఇద్దరు పిల్లలు మా కుటుంబం వ్యాపారం మీదనే నడుస్తోంది ఈరోజు మత్స్యశాఖ వారి సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఫిష్ ఆంధ్ర సూపర్ రెస్టారెంట్ యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నాను. ఈ పథకం ద్వారా యూనిట్ కాస్ట్ 20 లక్షల రూపాయలు కాగా 8 లక్షల రూపాయలును పెట్టడం జరిగింది మిగిలిన 12 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీగా ఇచ్చిందన్నారు. సహాయం చేసిన ప్రభుత్వానికి మత్స్య శాఖ అధికారులకు కృతజ్ఞతలు అంటున్నారు వెంకటేశ్వరమ్మ.