ANDHRABREAKING NEWSPOLITICSSTATE
సోమశిల జలాలు విడుదలపై రైతుల హర్షం

సోమశిల జలాలు విడుదలపై రైతుల హర్షం
ఎమ్మెల్యే మేకపాటికి కృతజ్ఞతలు
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, డిసెంబర్ 11, (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు నియోజకవర్గంలోని రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పిన విధంగా సోమశిల ఉత్తర కాలువ ద్వారా చిన్న సన్న కారు రైతులకు ప్రస్తుతం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కి రైతులు అంతా రుణపడి ఉంటారని నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఏఎస్ పేట మండలంలో నూటికి 90 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించే సన్న చిన్న కారు రైతులు ఉన్నందున ఐఏబి సమావేశంలో అభ్యర్థించిన విధంగానే మెట్ట ప్రాంత రైతాంగానికి సోమశిల జలాలను అందించేందుకు అహర్నిశలు కృషి చేసి సోమవారం సోమశిల ఉత్తర కాలువ ద్వారా తన స్వహస్తాలతో నీటిని విడుదల చేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి కృషి అభినందనీయమని ఏ ఎస్ పేట మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం తప్ప మరే ఇతర వృత్తి తెలియని రైతులు ఎక్కువ ఉన్న ఈ ప్రాంతం నందు వారి వ్యవసాయానికి కావలసిన నీరు అందడం లేదని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో తన నియోజకవర్గంలోని రైతులకు చివరి ఆయకట్టు వరకు ఒక్క ఎకరా కూడా నీరు అందక పంట నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అధికారులను సమన్వయం చేసి రాబోవు రోజుల్లో కూడా ప్రతి నీటి బొట్టు కూడా ప్రాధాన్యమేనని,నియోజకవర్గంలో ఏ రైతు పంట నష్టపడి బాధపడకూడదు అని,అధికారులంతా నియోజకవర్గంలోని అన్ని చెరువులను పరిశీలించాలని అవసరమైనచో తాను కూడా చెరువులను పరిశీలిస్తానని అధికారులను ఆదేశించిన మన ప్రియతమ నాయకులు మేకపాటి విక్రమ్ రెడ్డి చొరవ రైతులపై అభినందనీయమని ఈ సందర్భంగా రాజవోలు మాజీ సొసైటీ చైర్మన్ కాటంరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు.