కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ స్టెమీ/ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ వర్క్ షాప్ కార్యక్రమం గురించి
ఇంచార్జ్ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ స్టెమీ/ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రిలోని 50 మంది వైద్యులకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగిందని తెలియజేశారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ ప్రోగ్రాం భాగంగా స్టెమి ప్రోగ్రామ్ ద్వారా రిప్రెషింగ్ కోర్సు జరపడం జరిగింది అనంతరం ఇందులో డిసిహెచ్ కింద పనిచేసే జనరల్ మెడిసిన్ వైద్యులు, మరియు GGH కర్నూలు మెడికల్ విభాగం వైద్యులు పాల్గొన్నారు. కార్డియాలజీ వైద్యులు నిపుణులు గుండెపోటు కు వచ్చే కారణాలు మరియు ECGలో వచ్చే మార్పులు మరియు అత్యవసర ట్రీట్మెంట్ ఇవ్వడము, ధ్రాంబోలైసిస్ చేయడం, పేషెంట్స్ ను 108 అంబులెన్స్ ద్వారా ఎలా ఆస్పత్రికి తీసుకురావాలి అనేదానిపైన శిక్షణ ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన తరువాత స్టెంట్ ఎలా వేస్తారు, బైపాసు సర్జరీ ఎలా చేస్తారు అనే విషయాలపై అవగాహన కలిగించడం జరిగింది. ఈ తరహా కోర్సులు గుంటూరు మరియు వైజాగ్ లో జరిగాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, హెచ్వోడీస్, డా.శ్రీరాములు, డా. శ్రీలక్ష్మి బాయ్, డా.మహేశ్వర్ రెడ్డి, డా.విద్యాసాగర్, డా.శ్రీనివాసులు, డా.ప్రశాంత్, డా.లలిత, RMO డా.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నట్లు, ఇంచార్జ్ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, తెలిపారు.