ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
కర్నూలు కలెక్టరేట్, డిసెంబర్ 12, (సీమకిరణం న్యూస్) :
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీడీవో లను ఆదేశించారు. మంగళవారం ఉదయం అసైన్మెంట్ భూములు, ఎన్నికలు, హౌసింగ్, ఆడుదాం ఆంధ్ర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు , తహశీల్దార్లు, ఎంపిడిఓ లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సచివాలయం పరిధిలో కబడ్డీ, కోకో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆటలు ఖచ్చితంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు…ఈ క్రీడలకు సంబంధించిన ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. నియోజవర్గానికి, మండలానికి, సచివాలయానికి మెటీరియల్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని, కిట్లు అందినట్లుగా అక్నాలెడ్జ్మెంట్ లను ఆన్లైన్లో వెంటనే అప్లోడ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ ని కలెక్టర్ ఆదేశించారు. నందవరం, చిప్పగిరి, దేవనకొండ, మంత్రాలయం, కౌతాళం ,కల్లూరు, సి.బెలగల్, హాలహార్వీ, ఆదోని రూరల్, గొనెగండ్ల, వెల్దుర్తి, కృష్ణగిరి, కోడుమూరు, ఆస్పరి, హోలగుంద, పెద్దకడుబూరు, కోసిగి, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని అర్బన్, మద్దికేర, ఓర్వకల్లు, ఆలూరు, తుగ్గలి మండలాలు క్రీడాకారుల రిజిస్ట్రేషన్ లో వెనుకబడి ఉన్నారని, పేర్లు నమోదు చేయించాలని తెలిపారు. గ్రౌండ్ మ్యాపింగ్ కి సంబంధించి ఇంకా చేయని సచివాలయాలు ప్రైవేట్ లేదా ప్రభుత్వ గ్రౌండ్ లను గుర్తించి మ్యాపింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అసైన్మెంట్ భూములకి సంబంధించి చెక్ లిస్ట్ ప్రకారం పరిశీలించి ఎలాంటి తప్పిదాలు లేకుండా వచ్చే సోమవారం నాటికి జాయింట్ కలెక్టర్ లాగిన్ కి ధృవీకరించి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ కి సంబంధించి స్వయం సహాయక సంఘాల రుణాలకు సంబంధించిన వడ్డీ సబ్సిడీకి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 25 శాతమే అప్డేట్ చేశారని, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అప్డేషన్ లో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లోజాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, హౌసింగ్ పీడీ సిద్దలింగమూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.