
నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) అనే పథకం కింద కర్నూలు, రాజమండ్రి నగరాలను చేర్చేందుకు అవకాశం ఉంటే తగిన చర్యలు చేపట్టండి
కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్
కర్నూలు టౌన్, డిసెంబర్ 14, (సీమకిరణం న్యూస్) : నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) అనే పథకం కింద కర్నూలు, రాజమండ్రి నగరాలను చేర్చేందుకు అవకాశం ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సమావేశంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని కోరారు. గురువారం పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్)లో కర్నూలు జిల్లాను చేర్చే అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా కర్నూల్ ఎంపీ మాట్లాడుతూ నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందని, అయితే ఈ పథకంలో కర్నూలు, రాజమండ్రి నగరాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఉన్నట్లయితే బడ్జెట్ మాకు ఏ విధంగా ఇస్తారు, ఒకవేళ పథకంలో కర్నూలు రాజమండ్రి నగరాలు లేకపోతే వాటిని ఆ పథకం కింద చేర్చడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేదా?? అని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీహరిదీప్ సింగ్ పూరి గారిని ప్రశ్నించారు?? ఈ ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీహరిదీప్ సింగ్ పూరి గారు సమాధానం ఇస్తూ నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) అనే పథకం 2019 మార్చి నెలలో ముగిసిందని, , కొత్తగా ఇతర నగరాలను చేర్చేందుకు అవకాశం లేదని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీహరిదీప్ సింగ్ పూరి తెలియజేశారు.