హెల్త్ ఇన్సూరెన్స్ బీమా పథకాలను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి
సమాజంలో ప్రతి ఒక్కరికి బీమా పాలసీలపై అవగాహన అవసరం
గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ
జర్నలిస్టులకు యాక్సిడెంట్ బీమా పాలసీలను అందజేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ
కర్నూలు టౌన్, డిసెంబర్ 15, (సీమకిరణం న్యూస్) :
సమాజంలో ప్రతి ఒక్కరూ బీమా పాలసీలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కోరారు. నగరంలోని జిల్లా సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జర్నలిస్టులకు సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆక్సిడెంట్ భీమా పాలసీలను, క్యూ ఆర్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జయమ్మ ,ఐపిపిబి మేనేజర్ మహమ్మద్ అజీజ్ భాష, ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మీసాల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విదేశాలతో పోలిస్తే మన దేశంలో బీమాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్స్ వంటి బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమాజంలో ఎంతో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్న జర్నలిస్టులకు తన వంతుగా పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమా పత్రాలను అందజేస్తున్నట్లు వివరించారు. దీనివల్ల భీమా తీసుకున్న జర్నలిస్టులు ప్రమాదానికి గురైతే లక్ష రూపాయల వరకు, దురదృష్టవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల వరకు భీమా పరిహారం అందుతుందని చెప్పారు. ప్రపంచీకరణ, పట్టణీకరణ, మారిన జీవనశైలి విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసానిక మందులు తో పండించిన ఆహార ఉత్పత్తులు తినడం వల్ల షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధులు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు .ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుందని ఇది అందరూ భరించే పరిస్థితిలో లేరని చెప్పారు. అలాంటి వారికి ఆరోగ్య భీమా పథకం వరంలా పనిచేస్తుందని వివరించారు, ప్రపంచ దేశాలకు దీటుగా మనదేశంలో కార్పొరేట్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఇలాంటి వ్యాధికైనా చికిత్స అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఆర్థికంగా వెనుకబడిన వారు కార్పొరేట్ హాస్పిటల్ లో ప్రమాదకర వ్యాధులకు చికిత్స పొందలేరని అలాంటివారికి బీమా పథకాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయని చెప్పారు. క్యాన్సర్ లాంటి వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని తెలిపారు. యాక్సిడెంట్ బీమా లాంటి పథకాలు దురదృష్టవశాత్తు ఎవరైనా ఆక్సిడెంట్ లో మృతి చెందితే వారి కుటుంబాలకి కొండంత అండగా భీమా పరిహారం ఉపయోగపడుతుందని వివరించారు. అందుకే ప్రతి ఒక్కరూ భీమా పథకాలను తీసుకొని ధీమాగా జీవించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కోరారు.