ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మర్రిపాడు మండల నూతన కమిటీ ఎన్నిక
నెల్లూరు , ఆత్మకూరు, మర్రిపాడు, డిసెంబర్ 18,(సీమకిరణం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మర్రిపాడు మండల నూతన కమిటీ ఎన్నిక సోమవారం సాయంత్రం మర్రిపాడు ( ఎస్సీ ) (ప్రాథమికపాఠశాల నందు జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లాఅధ్యక్షుడు ఏ. సురేంద్ర రెడ్డి మాట్లాడుతో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయుల మీద పని భారంతగ్గించాలని,12 వ పి.ఆర్.సి కమిటీ వెంటనే విధులు చేపట్టేలాచూడాలని, అప్పటి లోగా మధ్యంతర భృతి 30 % 2013 జూలై, నుండి అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్యాన్ని కోరారు.ఎ.పి.టి.ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా సి.పి.ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎ.పి.టి.ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఆర్. వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, పర్యవేక్షణ అనేది బోధనకు సహాయపడే విధంగా ఉండాలని కోరారు. ఆనంతరం జిల్లా సబ్ కమిటీ సభ్యులు షేక్ కరీంమొహిద్దీన్,ఆర్. రామసుబ్బారెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. నూతన కమిటీ ని ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. మండల శాఖ గౌరవ అధ్యక్షులుగా పి.శివరామ్ రెడ్డి, అధ్యక్షులుగా యం. శ్రీనివాసులు రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా బి. వెంకటేశ్వర్లు రాజు, అసోసియేట్ అధ్యక్షుడు గాపి.నాగరాజలు, అదనపు కార్యదర్శిగా యు. శివ, జిల్లా కౌలర్లుగా యం. శివశంకరయ్య, యన్.సి.వెంకటేశ్వర్ల, కె. సుందర రామి రెడ్డి,కె.పెంచలయ్యి, కె.బి.వి. సుబ్బారెడ్డి, యం.పి. పిచ్చిరెడ్డి, పి.శ్రీనివాసులు, పి.సుధాకర్ వై.హరిక్రిష్ణ, కె. విజయ్ కుమార్, మహిళా కార్యదర్శిలుగా యన్. రాజశ్వరి. శ్రీడా, జె. సరస్వతి, ఆర్. శాంతి, కె.మాధవి, సిహెచ్. సుజాత, జై.పద్మ, ఆపి, ముక(క్రిష్ణమ్మ, బి. లక్ష్మీప్రసన్న అధ్యక్షులుగా జి.విష్ణు, బి.వెంకటేశ్వరు, యస్. శంకర్,నాయబ్ జానీ రాష్ట్ర కార్యదర్శులు ఆర్. కృష్ణ కుమారి, సి.హెచ్ మల్లికార్జున్, కరీం మొహిద్దీన్,వెంకటరెడ్డి ల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.