ఈ నెల 27నుండి లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు
జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య
కర్నూలు కలెక్టరేట్, డిసెంబర్ 18, (సీమకిరణం న్యూస్) :
కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్పందన కార్యక్రమం అనంతరం జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమానికి సంబంధించినపోస్టర్లను ఆవిష్కరించి, లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కు సంబంధించిన అధికారులతో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కుష్ఠువ్యాధి అనేది మైకోబ్యాక్టీరియా లెప్రి అనే సూక్ష్మ క్రిమి వలన వస్తుందన్నారు. ఈ వ్యాధిని త్వరగా గుర్తించి నిర్మూలిస్తే ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తించకుండా అరికట్ట వచ్చునని అన్నారు. జిల్లాలో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు. అందుకొరకే ఈ వ్యాధి అవగాహన కొరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కుష్ఠు వ్యాధికి సంబంధించి డిసెంబర్ 27వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 1700 టీములు ఏర్పాటు చేయడమైనది అని,ప్రతి టీమ్ లో ఇద్దరు ఉంటారని ఒకరు ఆషా కార్యకర్త మరొకరు వాలంటీర్ వుంటారని అన్నారు. టీమ్స్ లో మహిళలకు ఆషా కార్యకర్త, పురుషులకు మగ వాలంటీర్ పరీక్షించడమే కాక కుష్టు వ్యాధి లక్షణాలైన ప్రజలకు అవగాహన కల్పిస్తారని, ఈ కమిటీ సభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి జిల్లాలో లెప్రసీ కేసులను జీరో చేయవలసిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె.మధుసూదనరావు,
డి యం అండ్ హెచ్ ఓ రామ గిడ్డయ్య, జిల్లా కుష్ఠు,ఎయిడ్స్ మరియు టిబి నివారణ అధికారి డాక్టర్.భాస్కర్, డి యన్ యం ఓ, డాక్టర్ మల్లికార్జున, హెచ్ ఈ ఓ శివ శంకర రావు, డిపిఎమ్ఓ హక్, తదితరులు పాల్గొన్నారు.