ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి : రేఖగౌడ్
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి : రేఖగౌడ్
హెచ్ కైరవాడి హంద్రీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు
తవ్వకాలు చేసిన ప్రదేశాల్లో జనసేన సందర్శన
అధికారుల వైఫల్యం – చర్యలు శూన్యం
గొనెగండ్ల, డిసెంబర్ 18, (సీమకిరణం న్యూస్) :
అక్రమ ఇసుక తవ్వకాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో యదేచ్చగా నిర్వహిస్తున్న అధికారులు నియంత్రించడంలో మాత్రం ఘోరంగా విఫలమై పోయారని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పేర్కొన్నారు, సోమవారం గొనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి హంద్రీ పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా భూములను త్రవ్వి ఇసుక రవాణా చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు, అనంతరం వారు మాట్లాడుతూ పేద వారికి ఇంటి నిర్మాణపు అవసరాలకు వేల రూపాయలు ఖర్చు పెట్టిన సమయానికి అందని ఇసుక అధికార పార్టీ నాయకులకు మాత్రం స్టాక్ పాయింట్లు పెట్టుకొనెంత దొరకడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు, అడ్డగోలుగా హంద్రీ పరిసర ప్రాంతలైన గంజహల్లి, హెచ్ కైరవాడి, అగ్రహారం, గ్రామాల్లో రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు మాత్రం ఘోరంగా విఫలమై పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు, హంద్రీ ప్రాంతంలో ఇసుక రవాణా చేసేందుకు ప్రభుత్వ అనుమతి ప్రకారం రిచ్ ఏర్పాటు చేయలేదు కానీ అధికార పార్టీ నాయకులకు మాత్రం రిచ్ అడ్డాగా మారి పోయిందన్నారు, ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, అడ్డుకట్ట వేయకపోతే జనసేన పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, కర్ణం రవి, ఎల్లప్ప, ఖాసిం సాహెబ్, మాలిక్, దూద్ పీర, నరసింహులు, భాస్కర్, మునిస్వామి, సుభాన్, వినోద్, మాబాష, మల్లి, వెంకటేష్, మునాఫ్, ఆదమ్, ఇబ్రహీం, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.