
ఆరోగ్యానికి ఆత్మ రక్షణకు కరాటే సాధన తప్పనిసరి : డాక్టర్ పి చంద్రశేఖర్
కర్నూలు వైద్యం, జనవరి 12, (సీమకిరణం న్యూస్):
యూనివర్సల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద మార్కెట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కరాటే బెల్టు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గుండె సంబంధిత నిపుణులు (కార్డియాలజిస్ట్) డాక్టర్ పి. చంద్రశేఖర్ విచ్చేసి ప్రారంభించారు అనంతరం డా.చంద్ర శేఖర్ మాట్లాడుతూ క్రీడాకారులను అభినందించారు. కరాటే ఉషూ లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల రోగాలను దూరం చేస్తుందని కరాటే వల్ల ఏకాగ్రత పట్టుదల జ్ఞాపిక శక్తి ,సాహసం పెరుగుతుందని తెలిపారు.ఆరోగ్యానికి ఆత్మ రక్షణకు తోడ్పడుతుందని తల్లిదండ్రులు విద్యార్థుల చదువుతోపాటు వాళ్లకు నచ్చిన క్రీడల్లో రాణించాలని దానివల్ల గుండెకు సంబంధిం చిన వ్యాధులను దూరం చేస్తుందని అన్నారు. విజయం సాధించిన కరాటే క్రీడాకారులకు కలర్ బెల్టులు, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ బెల్ట్ టెస్ట్ కు 35 మంది చిన్నారులు పాల్గొన్నారు 8 ఈవెంట్స్ లో టెస్టులు నిర్వహించామని ఎగ్జామినర్లుగా సుధాకర్ చిన్న శ్రీనివాసులు, క్రాంతి క్రాంతి కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి , కరాటే మాస్టర్స్ సుధాకర్ , చిన్న శ్రీనివాస్ , క్రాంతి కుమార్ పాల్గొన్నారు.