
రెవిన్యూ శాఖ ద్వార ప్రజలకు మెరుగైన సేవలు అందించండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన
కర్నూలు ప్రతినిధి, జనవరి 20, (సీమకిరణం న్యూస్) :
రెవిన్యూ శాఖ ద్వార ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన రెవిన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆధునికరించిన సమావేశ మందిరంను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రారంభించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు కార్యాలయ పరిసర ప్రాంతాలను మన చేతనైనంతవరకు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆధునీకరించుకున్న సమావేశ మందిరా న్ని ప్రారంభించుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న కార్యాలయ ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని విధులను నిభద్రతతో నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశ మందిరం ఆధునీకరణకు కృషిచేసిన ఆర్డీవో హరిప్రసాద్, ఆర్ అండ్ బి అధికారులను అభినందించారు. సమావేశ మందిరాన్ని సమావేశాలకు వినియోగించుకుంటూ సక్రమముగా మెయింటెనెన్స్ చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శారద సంగీత కళాశాల అధ్యాపకులు కిరణ్, భరద్వాజ, రామయ్య, ప్రదీప్, లు సంగీత కచేరి నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన గారిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, డిఆర్ఓ కె మధుసూదన్ రావు, ఆర్డిఓ హరిప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ బి సురేష్ బాబు, డిఎస్పి సుధాకర్ రెడ్డి, తహశీల్దార్లు. ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారి వేణుగోపాలరావు, సనా ఆఫ్రీన్, అర్ డి ఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.