కుక్కలు బాబోయ్… కుక్కలు
కర్నూలు ప్రతినిధి, జనవరి 19, (సీమకిరణం న్యూస్) :
నగరంలోని ఏ వీధిలో చూసిన కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయని పలువురు ప్రజలు తమ దృష్టికి తెచ్చినట్లు ఎస్ డి పి ఐ నగర అధ్యక్షులు అస్పాక్ వెల్లడించారు. పాఠశాలలకు పిల్లలు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఏ వీధిలో చూసిన పదుల సంఖ్యలో గుమికూడి అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులు, పాతచారులపై దాడులు చేస్తున్నాయని, వాటి నుండి తప్పించుకునే క్రమంలో పలు ప్రమాదాల బారిన పడ్డ సంఘటనలు కో కొల్లలు. కుక్కల బారినపడి ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోక ముందే నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.