BREAKING NEWSPOLITICSSTATETELANGANAWORLD

రక్తదానంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం.

రక్తదానంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం.
రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు.
కామారెడ్డి ప్రతినిధి, మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై నిజాంసాగర్ మండలానికి చెందిన సుజాత కు కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త,కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు ను సంప్రదించడంతో పట్టణానికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టబోయిన స్వామి మానవతా దృక్పథంతో  వెంటనే స్పందించి సకాలంలో రక్తం అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. రక్త దానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయవచ్చునని అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించడానికి సిద్ధంగా ఉంటామని, ఎవరికైనా రక్తం అవసరం ఉన్నట్టయితే 9492874006 కి సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు చంద్ర కిరణ్ టెక్నీషియన్ చందన్ పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button
error: Content is protected !!