జర్నలిస్టుల హౌసింగ్ సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్ ధర్నా
అక్రిడేషన్ తో దరఖాస్తు చేసిన ప్రతి జర్నలిస్ట్ కు స్థలాన్ని కేటాయించేలా చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 14, (సీమకిరణం న్యూస్):
జిల్లాలో జర్నలిస్ట్ హౌసీంగ్ స్కిం కింద అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని కచ్చితంగా కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన హామీ ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ హౌసింగ్ స్కిం లో జర్నలిస్టుల భార్యల పేర్లపై ఇంటి పట్టా అందని,వంశపారంపర్యంగా సంక్రమించిన భూమి ఉందని,కార్లు ఉన్నాయని తదితర కారణాలతో జిల్లాలో 92 దరఖాస్తులు తిరస్కరణ చేయడం పై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర నాయకులు నజీర్ బాషా,బ్రహ్మయ్య అధ్యక్షత న ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర,జిల్లా నాయకులు ఎం. యు వినయ్ కుమార్ మాట్లాడుతూ దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని ఇవ్వాలని రకరకాల కారణాలు లేకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు లేవుట్ వేసి పట్టాల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. తిరస్కరణ అయిన 92 మంది జర్నలిస్టుల దరఖాస్తులు పరిశీలించి అందరికి పట్టాలు ఇవ్వాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న పట్టాలు ఇవ్వలేదని ఈ ప్రభుత్వంలో అయిన జర్నలిస్టుల హౌసింగ్ కల నెరవేర్చాలని అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ చేస్తున్న ధర్నా కార్యక్రమం దగ్గరకు సమాచార శాఖ డి.డి జయమ్మ సందర్శించి ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల డిమాండ్లు,అన్ని సమస్యలను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారని మీరు కోరిన విదంగా అక్రిడేషన్ కలిగి దరఖాస్తు చేసిన ప్రతీ ఒక్కరికి స్థలాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన కు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులువినతిని అందించారు.కలెక్టర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూ కార్లు,పొలాలు,కొనుక్కున్న స్థలాలు ఇలాంటివి ఉన్న అందరికి ఈ హౌసింగ్ స్కిం లో స్థలాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని, జి.ఓ ప్రకారం అమలు జరుగుతుందని,మీ భాగస్వామ్యం తో అమౌంట్ కట్టి తీసుకునే పట్టా ఇది ,జర్నలిస్ట్ వృత్తి రీత్యా పొందిన స్థలం పొంది ఉంటే తప్ప ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచార శాఖ డి.డి ని కలిసి మీ సమస్యలు తెలిపిన పరిష్కరిస్తారని స్థలాన్ని కూడా రెండు మూడు రోజుల్లో పరిశీలించి పట్టాలు అందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లాలో ఎమ్మార్వో లకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సుజాత, మధు,చెన్నయ్య,రమేష్, రవి,మస్తాన్, మధు, దామోదర్ సురేష్,మాలిక్ ,రాజు,లోకేష్,రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.