
మానసిక రుగ్మతలకు లోనవుతున్న డీఎస్సీ అభ్యర్థులు
డీఎస్సీ పరీక్ష గడువు పెంచాలి
కర్నూలు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి నౌషద్ భాష
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 24, (సీమకిరణం న్యూస్):
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుండి సదరు అభ్యర్థులు మానసిక రుగ్మతలకు లోనవుతున్నట్లు కర్నూలు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి నౌషద్ భాష పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుండి మార్చి 9 వరకు పెట్టు పరీక్ష కొనసాగుతుందని, అందుకు సంబంధించిన ఫలితాలు కూడా మార్చి 14న విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. కానీ మార్చి 15 నుండి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఈ ప్రభుత్వం పేర్కొంది. అయితే మార్చి 14న టెట్ లో అర్హత ఆయన అభ్యర్థులు కేవలం15 రోజుల్లో డీఎస్సీ కి ఎలా ప్రణాళికలు రూపొందించుకొని అందుకు అనుగుణంగా వారి విద్యను కొనసాగిస్తారని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష గడువు పెంచాలని నౌషద్ భాష ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.