ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
ఎమ్మిగనూరు అభివృద్ధి ప్రదాతలు ఆ ముగ్గురే

ఎమ్మిగనూరు అభివృద్ధి ప్రదాతలు ఆ ముగ్గురే
మీర్జా హసన్ బేగ్ మాచాని సోమప్ప మరియు బీవీ మోహన్ రెడ్డి..!
మొదటిసారిగా ఎమ్మిగనూరు టిడిపి సీటు, బీసీ వర్గం మాచాని సోమనాథ్ కే టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం
ప్రాముఖ్య సీనియర్ నాయకులు కోటేకల్ షబ్బీర్ అహ్మద్




ఎమ్మిగనూరు ప్రతినిధి, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అభివృద్ధికి పాటుపడిన మహనీయులు ఆ ముగ్గురే అంటూ ప్రముఖ సీనియర్ నాయకుడు కోటేకల్ షబ్బీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం రాకముందు మొగల్ సామ్రాజ్యంలో సామంత రాజుగా పరిపాలించిన మీర్జా హసన్ బేగ్ 1925 -1950 మధ్యకాలంలో 300 ఎకరాల భూమిని దళితులు కాలనికి ఎద్దుల మార్కెట్, కూరగాయల మార్కెట్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, బస్టాండ్ నిర్మాణాలకు ధారా దత్తం చేసి ఎమ్మిగనూరు మొదటి అభివృద్ధి దాతగా నిలిచిపోయారని, అలాగే పద్మశ్రీ మాచాని సోమప్ప 1945- 75 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వివర్స్ కాలనీ, పట్టణ సొసైటీ కార్యాలయం, సోమప్ప నగర్, మాచాని సోమప్ప ఇండోర్ స్టేడియం, పాలస్టోరు నిరుపేదలకు గృహవాసాలకు స్థలాలు కేటాయించి, ఇంకా ఎన్నెన్నో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి భూములు ఇచ్చి నిర్మాణాలు చేపట్టారని, దేశంలోనే ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు గుర్తింపు తెచ్చి పెట్టిన ఘనత మాచాని సోమప్ప కి దక్కిందని, వారి హయాంలో చేనేతలకు చేనేత వస్త్రాలకు ,మంచి గుర్తింపు లాభదాయకంగా విరాజిలిందని వారి సేవలను గుర్తించే భారత ప్రభుత్వం భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి మాచాని సోమప్ప గారిని తెలిపారు.
ఎమ్మిగనూరు మూడవ అభివృద్ధి ప్రదాత కీర్తిశేషులు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు అంటే బీవీ గడ్డ అభివృద్ధికి అడ్డా అనే విధంగా తాను ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన హయంలో ఎమ్మిగనూరును అభివృద్ధి పథంలో తీర్చిదిద్ది పరుగులు పెట్టించారని ఎమ్మిగనూరు ఈరోజు నిర్మాణ రంగంలో అభివృద్ధి పరంగా ఉందంటే అది బీవి మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని ఈరోజు అయినా మనలో లేకున్నా ఆయన చేసిన అభివృద్ధి పనులతో ఎప్పటికీ మనతో ఉన్నారని ఏ వీధిలో ఏ గల్లీలో వెళ్లి చూసిన ఆయన చేసిన అభివృద్ధి పనులే నెటికి దర్శనమిస్తున్నాయని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ఎమ్మెల్యేలు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నచందంగా ఉందని ఎమ్మిగనూరు లొ అభివృద్ధి బీవీ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధె చివరిగా మిగిలిపోయిందన్నారు ఎమ్మిగనూరు అభివృద్ధి ప్రదాత కల్మషం లేని ముక్కు సూటి నాయకుడు చేసిన అభివృద్ధి తప్పితే ఇంతవరకు ఎమ్మిగనూరు అభివృద్ధి చేసిన నాయకుడు లేడని బీవీ తనయుడు బివి జయ నాగేశ్వర్ రెడ్డి తండ్రి మరణాంతరం సార్వత్ర ఎన్నికల్లో 2014 నుండి 2019 వరకు శాసనసభ సభ్యులుగా తండ్రి బాటలోనే అభివృద్ధి కొనసాగించారని ప్రజలు మారిపోరుకోవడంతో తర్వాత కాలంలో ఎమ్మిగనూరులో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
తాత బాటలోనే అభివృద్ధి చేసి చూపిస్తానని
పద్మశ్రీమాచని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్ టిడిపి పార్టీ తరఫున సుడిగాలి పర్యటన చేస్తూ వాడవాడలా తిరుగుతూ ప్రజలతొ మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ టిడిపిని గెలిపిస్తే ఎమ్మిగనూరు అభివృద్ధిలో నడిపిస్తానని ప్రజలకు హామీనిస్తున్నారు ఇదే కోవలో బీసీ వర్గం నుండి పార్టీ మాచాని సోమనాథ్ టికెట్ ఆశించడంతో అధిష్టానం కూడా బీసీల వైపు ఆలోచిస్తుందని బీసీలకు ఎమ్మిగనూరు టిడిపి సీటు ఇచ్చే అవకాశలు మెండుగా ఉన్నాయని ప్రముఖ సీనియర్ నాయకులు కోటేకల్ షబ్బీర్ అహ్మద్ తెలిపారు.