ప్రపంచ రికార్డ్స్ లో గొట్టిముక్కుల నాసరయ్య పేరు నమోదు
ప్రపంచ రికార్డ్స్ లో గొట్టిముక్కుల నాసరయ్య పేరు నమోదు
తాడేపల్లిగూడెం, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన కవి, ప్రముఖ రచయిత, తెలుగు అధ్యాపకులు, శ్రీ శ్రీ కళావేదిక కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుద్దాల కన్వెన్షన్ హాల్ లో అంతర్జాతీయ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 24 గంటల 24 నిమిషాల 24 సెకన్ల ప్రపంచ కవితోత్సవoలో పాల్గొన్ని ఆదర్శ మహిళ గురించి చక్కని కవితా గానం చేసినందుకు నాసరయ్యను అభినందిస్తున్నామని, మన సంస్కృతి – సంప్రదాయాల అభివృద్ధికి సాహిత్యం ద్వారా నాసరయ్య కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తానా బుక్ ఆఫ్ రికార్డ్స్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ) లలో గొట్టిముక్కుల నాసరయ్య పేరు నమోదు చేసినట్లుగా దృవీకరిస్తూ శాలువాతో ఘనంగా సత్కరించి ప్రపంచ రికార్డ్ లో నమోదు ప్రశంసా పత్రం మరియు పురస్కారంతో ఘనంగా సన్మానించారు, అంతర్జాతీయ శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు డా. కత్తిమండ ప్రతాప్ మరియు జాతీయ కమిటీ సభ్యులు చేతుల మీదగా పురస్కారం అందుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ రికార్డ్స్ కవితోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తన పై ఇంకా బాధ్యత పెరిగిందని, తెలుగు వెలుగు వెలగాలని, మాతృభాషాను పరిరక్షించుకోవాలని, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపారు, నాసరయ్యను ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు, కవులు, సాహితీ వేత్తలు, తల్లిదండ్రులు, గురువులు, బంధు మిత్రులు తదితరులు అభినందించారు. ఈ ప్రపంచ కవితోత్సవం శనివారం ఉదయం 10 గంటల 24 నిమిషాల 24 సెకండ్లకు ప్రారంభమై ఆదివారం ఉదయం 10 గంటల 24 నిమిషాల 24 సెకండ్లకు ముగిసిందని, ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వెయ్యి మంది పైగా కవులు, కవియిత్రిలు పాల్గొన్నారని తెలిపారు.