మీలో ఒకడిగా..
-: స్వలాభం వద్దు.. ప్రజాసేవ ముద్దు
-: స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.నౌషద్ భాష
కర్నూలు ప్రతినిధి , మార్చి 16, (సీమకిరణం న్యూస్) :
ప్రజాసేవతో మీలో ఒకడిగా ఉంటూనే.. ఎలాంటి స్వలాభం లేకుండా.. ప్రజాసేవకు నిత్యం పరితపించే వ్యక్తిని త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలోని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎస్.నౌషద్ భాష పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాంటి వారికి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నేను మీ నౌషద్ భాషను అంటూ ఒక దృఢ సంకల్పంతో రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తున్నానన్నారు. నా జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదని, నాకు నిజాయితీ,నిబద్ధత ఉందని, ప్రజా సమస్యలపై పోరాడగల సత్తా ఉందని భావిస్తే ఈ ఎన్నికల్లో మీ విలువైన వజ్రాయుధం అనే ఓటుతో తనను గెలిపించాలని నౌషద్ బాషా విజ్ఞప్తి చేశారు.