వైసీపీకి మరో బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణ
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల
కర్నూలు ప్రతినిధి/ కోడుమూరు, మార్చి 20, (సీమకిరణం న్యూస్):
కోడుమూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరిగెల మురళీకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన పరిగెల మురళి కృష్ణకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం వైయస్ షర్మిల మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మురళి కృష్ణ కోడుమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారని ఆమె తెలిపారు. వైయస్సార్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడము ఎంతో శుభదినం అని ఆమె అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మురళి కృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయనను కోడుమూరు నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఆమె తమ ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో కోడుమూరు నియోజకవర్గంలోని ఆయన అభిమానులు కార్యకర్తలు బాణా సంచి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.