ప్రచారంలో దూసుకుపోతున్న కేఈ శ్యామ్ బాబు

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ
పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నకేఈ శ్యామ్ బాబు
భవిష్యత్తు గ్యారెంటీ బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమం
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి , మార్చి 24, (సీమకిరణం న్యూస్):
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ లభిస్తుందని పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు అన్నారు. ఆదివారం పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల పరిధిలో ఉన్న రత్నపల్లి గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ.శ్యామ్ బాబు ” బాబు ష్యూరీటి- భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6)” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రత్నపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ” బాబు సూపర్ 6″ మ్యానిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి, 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రిగా చెయ్యాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేఈ.శ్యామ్ బాబు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల తెదేపా నాయకులు , రత్నపల్లి గ్రామంకి చెందిన తెలుగుదేశం పార్టీ, నాయకులు మరియు గ్రామ/వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.