సంక్షేమాన్ని అందుకున్న ప్రతి ఒక్కరూ జగన్ కు తోడుగా నిలవాలి
: ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఓటుతో జవాబు చెప్పాలి
: మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
: కృష్ణాపురం, బెడుసుపల్లిలో రచ్చబండ కార్యక్రమం
నెల్లూరు, మర్రిపాడు, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందచేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రానున్న 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తోడుగా నిలిచి మళ్లీ ఆయనను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకోవాలని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మర్రిపాడు మండలం బెడుసుపల్లి, కృష్ణాపురం గ్రామాల్లోని పలు కాలనీల్లో ప్రజలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముక్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 58 నెలల కాలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించారన్నారు. సంక్షేమాన్ని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆయనను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు పచ్చమీడియా సహకారంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవాస్తవ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ప్రజలకు సంక్షేమాన్ని అందచేయలేదని అంటున్నారని అన్నారు. ప్రతి రోజు జగన్ మోహన్ రెడ్డిపై బురద చల్లే విధంగా మాట్లాడుతూ ప్రజలు వాటిని నమ్మాలంటూ ప్రచారాలు చేస్తున్నారని, వారు చేస్తున్న ప్రచారాలు ఏది నిజం కాదన్న విషయం సంక్షేమ పథకాలను అందుకున్న ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని తీసుకురావడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివి అభివృద్దిలోకి వచ్చిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. అదే విధంగా సంక్షేమ ముఖ్యమంత్రి పాలనలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సామాజిక పించన్లు అందచేశారని, విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి అందరూ చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసుకునేందుకు గ్రామస్తులే ముందుకు రావాలని, సమస్య ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో ప్రజలు తెలుపుతున్న సమస్యలను ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు. మన ప్రాంతంలో సస్యశ్యామలం అయ్యేందుకు హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, రానున్న 3, 4 సంవత్సరాలల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అంది ఈ ప్రాంతం సస్యశ్యామలవుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అందుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని, మీ ఇంట్లో సంక్షేమం జరిగితేనే ఓటు వేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు కోరుతున్నారని, ఆయనను గెలిపించాలంటే ఆయన సారధ్యంలో ఇక్కడ పోటిలో నిలబెడుతున్న అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేది నుంచి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్రకు సిద్దమయ్యారని, ఎన్నికల ప్రచారం 21 రోజుల పాటు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు కొనసాగుతుందని, సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యునిగా వీ విజయసాయిరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా మేకపాటి విక్రమ్ రెడ్డిలు రానున్న ఎన్నికల్లో పోటి చేస్తున్నారని, వారిని అత్యధిక మెజారిటితో గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ది కోసం మళ్లీ ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి మన ప్రాంతాన్ని అభివృద్ది చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు ఫ్యాన్ గుర్తుకుపై ఓటు వేయాలన్నారు