మోటార్ సైకిల్ ల దొంగ అరెస్ట్
మోటార్ సైకిల్ ల దొంగ అరెస్ట్
మోటార్ సైకిల్ చోరీ ని చేదించిన వెల్దుర్తి పోలీసులు
స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా ను అభినందించిన జిల్లా ఎస్పీ
ఒకరు అరెస్ట్ ఇద్దరు పరారీ
16 మోటర్ సైకిల్ లు స్వాధీనం
వీటి విలువ ₹6,40,000/
కర్నూలు క్రైమ్/వెల్దుర్తి, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపిఎస్ ఆదేశాల మేరకు పత్తికొండ డిఎస్పి శ్రీ శ్రీనివాసరెడ్డి సూచనలతో వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి ఎస్ఐ ఎం చంద్రశేఖర్ రెడ్డి తన సిబ్బంది తో కలిసి కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ అధికారుల సమాచారం మేరకు క్రిష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామంలో ఒక షెడ్డులో దాచిన దొంగలించబడిన మోటార్ సైకిల్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన దర్శినేని నాగభూషణ్ s/o బాలరాజు (వయస్సు23) అంతరాష్ట్ర మోటార్ సైకిల్ల దొంగ ను అరెస్టు చేసి విచారించగా అనంతపురం టౌన్ నందు మరియు నంద్యాల జిల్లా నందివర్గం, నందికొట్కూరు, వెల్దుర్తి మరియు ఇతర జిల్లాల నుండి 16 మోటార్ సైకిల్ లను దొంగలించి దాచిపెట్టి వీటిని అమ్మడానికి కృష్ణగిరి మండలం ఎరుకలచెరువు గ్రామానికి చెందిన కురువ అశోక్ మరియు నంద్యాల జిల్లా డోన్ రూరల్ పరిధిలో ఉన్న రేకులకుంట గ్రామానికి చెందిన బెస్త వెంకటేష్ లతో కలిసి పథకం ప్రకారము మోటార్ సైకిళ్ళు అమ్మడానికి పెట్టుకున్నట్లు తెలుపగా వాటిని స్వాధీనం చేసుకుని పంచనామా రాసి నిందితున్ని డోన్ సబ్జైల్ కు రిమాండ్ నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసి వాహనాల యజమానులు ఎవరన్న కోణంలో ఆర్టీవో కి లేఖ వ్రాసి ఆ సమాచారంతో వారి మోటార్ సైకిల్లను కోర్టు ద్వారా ఇస్తామని తెలిపారు. క్రిష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామానికి చెందిన కురువ అశోకు మరియు డోన్ తాలూకా రేకులకుంట గ్రామవాసి బెస్త వెంకటేష్ లు పరారీలో ఉన్నట్లు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతామని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ దొంగలించబడిన మోటార్ సైకిల్ సమాచారాన్ని ఇచ్చిన వెల్దుర్తి సర్కిల్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్ (HC:888) కి వెల్దుర్తి సీఐ సురేష్ కుమార్ రెడ్డి చేతుల మీద నగదు రివార్డును అందజేశారు. గత నెల 2 వ తేదీ అమ్మకతాడు టోల్గేట్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో తరలిస్తున్న సుమారు నాలుగున్నర కోటి విలువ చేసే నగదు &బంగారు& వెండి పట్టుకున్న కేసులో కూడా స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కాజా కీలకపాత్ర వహించారు..