ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

వైభవంగా ఉస్తాద్ బాబా గంధ మహోత్సవం

వైభవంగా ఉస్తాద్ బాబా గంధ మహోత్సవం
 నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చ్ 25, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన ఏఎస్ పేట రహమతాబాద్ లో వెలసి ఉన్న హజ్రత్ మీర్జా మహమ్మద్ హుస్సేన్ బేగ్ ఉరఫ్ ఉస్తాద్ బాబా స్వాముల వారి గంధమహోత్సవం ఆదివారం రాత్రికి అంగరంగ వైభవంగా నిర్వహించారు గంధమును ఉస్తాద్ బాబా మంజిల్ నుండి ఊరేగింపుగా భక్తి కీర్తనలు, ఫకీరుల జరబులు, బ్యాండ్ మేళాలు, బాణాసంచా కాలుస్తూ మొదటగా స్థానిక పెద్ద దర్గా ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారికి గంధమును ఎక్కించి అనంతరం ఫక్రుద్దీన్ బాబా దర్గాలో గంధం ఎక్కించారు అక్కడినుండి ఉస్తాద్ బాబా దర్గాకు చేరుకొని గంధమును బాబా సమాధులకు లేపనం చేసి ప్రత్యేక సలాములు పాడి ప్రార్ధనలు చేసి దువా చేశారు అనంతరం భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టారు ఈ గంధమహోత్సవ కార్యక్రమాలు దర్గా సజ్జాద నషీన్ ఎం అబ్బాస్ అలీ బేగ్,  మేనేజ్మెంట్ మొహమ్మద్ రహమత్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు  గంధ మహోత్సవానికి అతిధులుగా పెద్ద దర్గా సాని సజ్జాద నషీన్  ఎస్ జి ఎన్ జునేద్ పాషా, హజ్రత్ మౌలానా ఖారి షా మొహమ్మద్ తాజుద్దీన్ అల్ ఉమర్ పాషా సజ్జద నసీన్ దర్గా షా రఫీఉద్దీన్ ఖండారి, యాకూబ్ ఖాద్రి కాజీపేట, సూఫీ బాబా, ఎస్ జి ఎన్ ఫయాజ్ అహ్మద్   హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉస్తాద్ బాబా కుమారులు హాఫీస్ ఇబ్రహీం బేగ్,రహమతుల్లా బేగ్,హబీబుల్లా బేగ్, ఆషీఖానే ఉస్తాద్ బాబా రహీం, రావూఫ్, అఫ్జల్, ఇబ్రహీం,  మునీం,జాకీర్ పెద్ద ఎత్తున స్థానికులు భక్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!