ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
వెల్దుర్తిలో వైసీపీకి మరో భారీ షాక్..టీడీపీలో చేరిన ఉప సర్పంచ్ శ్వేత

వెల్దుర్తిలో వైసీపీకి మరో భారీ షాక్..టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత
టీడీపీలోకి 50 ఎస్సీ కుటుంబాలు, 10 ముస్లిం కుటుంబాలు చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మార్చి 27, (సీమకిరణం న్యూస్) :


వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ. శ్యామ్ బాబు సమక్షంలో వెల్దుర్తి ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెతో ముత్యాల అరుణ్, నాయకంటి విక్రమ్, లక్ష్మన్న డానియల్ తో పాటు మరో 50 ఎస్సీ కుటుంబాలు అలాగే ముస్లిం కమ్యూనిటీకి చెందిన సలాం, అక్బర్ ల 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లోకి చేరగా వారికి శ్యామ్ బాబు, జ్ఞానేశ్వర్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డి పల్లి సుబ్బారాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు సుదేపల్లి జయ రాముడు, సుధాకర్ గౌడ్, సిద్దనగట్టు వెంకటేశ్వర్లు, హరి కృష్ణ, మల్లి, ఏల్లగౌడ్, బిఎస్ఎన్ఎల్ సూరి, నాయకంటి హరి, గిడ్డయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.