BREAKING NEWSPOLITICS
చిట్యాల గ్రామంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

చిట్యాల గ్రామంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
కేఈ శ్యామ్ బాబు సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన నక్క నాగరాజు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి / క్రిష్ణగిరి, మార్చి 27, (సీమకిరణం న్యూస్) :
పత్తికొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న క్రిష్ణగిరి మండలంలోని చిట్యాల గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ.శ్యామ్ బాబు గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నక్క నాగరాజు వారి వర్గం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కేఈ శ్యామ్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ విధి విధానాలు నచ్చకపోవడం వల్ల గతంలో టిడిపి కేఈ కుటుంబం ఇచ్చిన ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవ్వకపోవడం నియోజకవర్గంలోనే అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చేయకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీలోకి కేఈ.శ్యామ్ బాబు వారి చేతుల మీదుగా టిడిపి కండువా కప్పుకొని పార్టీలోకి చేరినట్లు తెలిపారు