ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
టీడీపీలో చేరిన వైకాపా నేత రామకృష్ణ

టీడీపీలో చేరిన వైకాపా నేత రామకృష్ణ
మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన రామకృష్ణ
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :

వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ. శ్యామ్ బాబు సమక్షంలో వెల్దుర్తికి చెందిన వైకాపా నేత అంచ్చే రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. కేఈ శ్యామ్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా అభివృద్ధి చేస్తానని కేఈ శ్యామ్ బాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.