ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బుక్ కీపర్ లు

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బుక్ కీపర్ లు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన బుక్ కీపర్ లు హనుమంతు కుమారుడు సుధాకర్, సంటన్న కుమారుడు రంగడులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినట్లు గ్రామానికి చెందిన కే పార్వతయ్య తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన ఆ ఇద్దరు బుక్కీపర్లు పొదుపు లక్ష్మి గ్రూపు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఓటర్లను అడగడమే కాకుండా, వైయస్సార్ పార్టీకి సపోర్టు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైయస్సార్ కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఆ ఇద్దరు బుక్ కీపర్ లపై చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని వెల్దుర్తి తాసిల్దార్ హామీ ఇచ్చారు.