ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
మా మొదటి ఓటు టిడిపికే

మా మొదటి ఓటు టిడిపికే
టిడిపిలో చేరిన కొత్త ఓటు హక్కు వచ్చిన 60 మంది యువకులు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
మాకు కొత్తగా ఓటు హక్కు వచ్చిందని ఈసారి మా మొదటి ఓటు తెలుగుదేశం పార్టీకేనని తామంతా కేఈ శ్యామ్ బాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నట్లు యువకులు తెలిపారు. వెల్దుర్తిలో పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు గారి ఆధ్వర్యంలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన 60 మంది యువకులు తెదేపాలో చేరారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం అనంతరం 60 మంది యువకులకు కేఈ శ్యామ్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు అన్న మాట్లాడుతూ యువకులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. తెదేపా అధికారం చేపట్టిన వెంటనే యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. అనంతరం వెల్దుర్తి లోని 4,5 వార్డులలో పర్యటించి ఓటర్లకు, మహిళలకు తెదేపా చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. కాలనీవాసులు సైతం కేఈ శ్యామ్ బాబుకి ఘనంగా స్వాగతం పలికారు. కాలనీలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బొమ్మన శివ శంకర్ రెడ్డి, మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్, టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, బొమ్మిరెడ్డి పల్లె లక్ష్మి రెడ్డి, రమాకాంతారెడ్డి, రామళ్లకోట ఆచారి, రామచంద్రుడు, బజారు, వీరభద్రుడు, సుధాకర్, బాలరాజు, రాఘవేంద్ర, సూరి, టిడిపి కార్యకర్తలు ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.