ANDHRABREAKING NEWSHEALTHSTATE
ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలి
ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలి
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పేద ముస్లిం మహిళలకు గొడుగులను పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు ప్రతినిధి, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రీ ఎస్టేట్లో ఉన్న తన క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వేసవి మండుటెండల నుంచి రక్షించుకునేందుకు వీలుగా పేద ముస్లిం మహిళలకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి మండు టెండల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు. ముఖ్యంగా పేద ప్రజలు పనిచేస్తే తప్ప పూట గడవని అలాంటి వారు బయటికి రావాలంటే ఎండ వేడి గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయాలన్న సూక్తిని పాటిస్తూ పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఇందుకోసమే తాను పేద ముస్లిం మహిళలకు ఎండ వేడిమి గురి కాకుండా వీలుగా గొడుగులను పంపిణీ చేశానని వివరించారు .ముఖ్యంగా ఈ మండుటెండల నేపథ్యంలో ఎండల వేడికి గురైతే వడదెబ్బ లాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. అలాగే ఎండ వేడికి గురి కావడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ కావడం, ఎలక్ట లైట్స్ లోపించడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఎండాకాలంలో పరిశుభ్రమైన నీళ్లు తాగాలని కలుషితమైన నీటిని తాగడం వల్ల విరోచనాలు ,గ్యాస్ట్రో ఎంటర్టైటిస్, కలరా ,టైఫాయిడ్, జాండీస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వివరించారు .ముఖ్యంగా బీపీ షుగర్ వంటి జబ్బులతో బాధపడే వారితో పాటు వృద్ధులు ,చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తీసుకోవద్దని దీనివల్ల ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఎదురవుతాయని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తదితరులు పాల్గొన్నారు.