ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు : కేఈ శ్యామ్ బాబు

టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు
పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
టి. గోకులపాడు గ్రామంలో కేఈ శ్యామ్ బాబుకు బ్రహ్మరథం పట్టిన స్థానికులు
బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై విస్తృత ప్రచారం
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 01, (సీమకిరణం న్యూస్) :


టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు అన్నారు. సోమవారం క్రిష్ణగిరి మండలంలోని టి. గోకులపాడు గ్రామంలో బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై కేఈ శ్యామ్ బాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. క్రిష్ణగిరి మండలంలోని టి. గోకులపాడు గ్రామంలో కేఈ శ్యామ్ బాబుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా అభివృద్ధి చేస్తానని కేఈ శ్యామ్ బాబు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీ అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి మండలం చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మరియు గోకులపాడు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.