ANDHRABREAKING NEWSPOLITICSSTATE

టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటి ..?

టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటి ..?

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిఅన్నారు. ఆదివారం చెరుకులపాడు తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఉన్నతమైన చదువులు చదివిన ఉద్యోగం రాకపోవడంతోనే రామాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అయ్యాడని అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు మాట్లాడటం మంచిది కాదని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అన్ని వర్గాలలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, వారికి అన్ని చోట్ల 50 శాతం మించి రిజర్వేషన్ అమలుతో సామాజిక న్యాయం చేసి, రాబోవు ఎన్నికల్లో సైతం వారికి ఏకంగా ఎమ్మెల్యేగా నిలిచే అవకాశం ఇచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు పెద్దపీట వేశాడని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా నిలిచిన రామాంజనేయులును దళితుడైన ఒక టిప్పర్ డ్రైవర్ ఏం చేస్తాడంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చులకనగా మాట్లాడడం తగదన్నారు. టిప్పర్ డ్రైవర్. ఇతర స్వంత కాళ్లపై నిలబడి పని చేసుకుంటున్న ఎందరో పేదలు ప్రజా సేవలో ముందున్నారన్నారు. అలాంటి వారికి సీఎం జగనన్న అవకాశమివ్వడం. పేదలు కూడా అసెంబ్లీలో కూర్చుంటారన్నది చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!