మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
రామళ్లకోట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 01, (సీమ కిరణం న్యూస్) :
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల వరకేనని, ఆపై మళ్లీ రాష్ట్రంలో వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని వివరిస్తూ మరొకసారి ఎమ్మెల్యే గా తనకు ఎంపిగా బివై రామయ్య కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల పథకాలు అమలు చేసి ప్రతి ఇంటికి సంక్షేమ అందించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు. రాబోవు రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగే గెలిపించుకొని మరిన్ని సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అమలు అయ్యేలా ప్రతి గ్రామం అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. అలాగే గ్రామంలో ఉన్న ప్రతి అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతినెల 1వ తేదీనే వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి పింఛను అందించే వారిని చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలలో భాగంగా మీ పింఛన్ ఇంటి దగ్గర కాకుండా సచివాలయాల దగ్గర వెళ్లి తీసుకోవాలని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది అన్నారు. అయినా ఎవరు అధైర్యపడద్దని మళ్లీ వచ్చేది మన వైయస్సార్ పార్టీ ప్రభుత్వమేనని మరల తిరిగి ప్రతి ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా పింఛన్ అందజేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రామళ్లకోట గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వెల్దుర్తి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.