రాజీమార్గమే రాజమార్గం
రాజీమార్గమే రాజమార్గం
ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ గురు అరవింద్
ఫస్టుక్లాస్ కోర్టుల్లో జాతీయ మెగా లోక్ అదాలత్…
పలు కేసుల పరిష్కారం..
ఎమ్మిగనూరు ప్రతినిధి, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :
రాజీ మార్గమే రాజమార్గం అని కక్షిదారులు లోక్ అదాలత్ కేసులు పరిష్కరించుకొని డబ్బు సమయం ఆదా చేసుకోవాలని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ గురు అరవింద్ అన్నారు. జిల్లా న్యాయమూర్తుల సూచనమేరకు శనివారం పట్టణంలోని ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జాతీయ మెగా లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గురు అరవింద్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో 278 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. వాటిలో క్రిమినల్ మరియు సివిల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు వర్గాల ఒప్పందంతో రాజీ కుదిర్చే అవకాశాన్ని లోక్ అదాలత్ కల్పిస్తుందన్నారు. దీని ద్వారా సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.