ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

మరింత అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే శ్రీదేవి

మరింత అభివృద్ధి చేస్తా… మరో అవకాశం ఇవ్వండి…
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
రత్నపల్లే ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
ఘన స్వాగతం పలికిన స్థానికులు
వెల్దుర్తి, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
మరింత అభివృద్ధి చేస్తా… మరో అవకాశం ఇవ్వాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి మండల పరిధిలోని రత్నపల్లి, యాదరాల గ్రామాలలో పర్యటించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని వివరిస్తూ మరోసారి ఎమ్మెల్యే గా తనకు ఎంపిగా బివై రామయ్య కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రానున్నది జగన్ ప్రభుత్వమేనని ప్రజలకు తెలిపారు. టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే విమర్శించారు. పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు వెనువెంట ఉండి సేవలు అందించే భాగ్యం కల్పించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరల మాకే సీటు కేటాయించడం జరిగింది జగన్ ప్రభుత్వంలో మరల ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఓటరులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రత్న పల్లె రమణారెడ్డి, కొత్తూరు వెంకటేశ్వర్ రెడ్డి, అల్లు గుండు శ్రీరామ్ రెడ్డి, బొమ్మిరెడ్డి పల్లె మధుసూదన్ రెడ్డి, నర్సాపురం వెంకట కృష్ణారెడ్డి, బింగ్ దొడ్డి జగన్మోహన్ రెడ్డి, వెల్దుర్తి పట్టణ కార్యదర్శి వెంకటనాయుడు, ఆరిఫ్, చెర్ల కొత్తూరు శేఖర్, గోవర్ధనగిరి కేశవులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!