గ్రామాల అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే శ్రీదేవి
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన స్థానికులు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 02, (సీమకిరణం న్యూస్) :
గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి మండల పరిధిలోని సర్ప రాజపురం, నరసాపురం, ఎస్ బోయినపల్లి గ్రామాలలో పర్యటించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని వివరిస్తూ మరోసారి ఎమ్మెల్యే గా తనకు ఎంపిగా బివై రామయ్య కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేర్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రానున్నది జగన్ ప్రభుత్వమేనని ఓటర్లకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది లేదని విమర్శించారు. పేదలకు అండగా ఉన్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని మరల ఆశీర్వదించి మరోసారి సేవలను చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉందని ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్ రెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు బొమ్మన రవి రెడ్డి, సరఫరాజపురం వెంకటేశ్వర రెడ్డి, నరసాపురం వెంకట కృష్ణారెడ్డి, ఎస్ హెచ్ బోయినపల్లి నర్సింగ్ అశోక్ రెడ్డి, అల్లు గుండు శ్రీరామ్ రెడ్డి, బింగిదొడ్డి జగన్మోహన్ రెడ్డి, రామళ్లకోట మాధవస్వామి, కిట్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.