ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం

జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
వెల్దుర్తి లో అడుగడుగునా జన నీరాజనం…ఎమ్మెల్యే శ్రీదేవి కి ఘన స్వాగతం
వెల్దుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :


2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగనన్న రెండోసారి సీఎం కావడం ఖాయమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. గురువారం వెల్దుర్తి పట్టణంలోని 14, 15 వార్డులలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని వివరిస్తూ మరోసారి ఎమ్మెల్యే గా తనకు ఎంపిగా బివై రామయ్య కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేసింది జగన్ ప్రభుత్వంలోనే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి, బ్రహ్మగుండం చైర్మన్ బొమ్మన పెద్దిరెడ్డి, జడ్పిటిసి దాది పోగు సుంకన్న, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శైలజ, అల్లు గుండు శ్రీరామ్ రెడ్డి, బొమ్మిరెడ్డి పల్లె మధుసూదన్ రెడ్డి, అల్లు గుండు గోపి, వెల్దుర్తి పట్టణ కన్వీనర్ వెంకట నాయుడు, గట్టు హరీఫ్, డేవిడ్ రాజు, అనిల్ రెడ్డి, చెరుకులపాడు మాజీ సర్పంచ్ శివ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.