ANDHRABREAKING NEWSHEALTHSTATEWORLD
యాపిల్ డయాగ్నస్టిక్ సెంటర్ లో టీబి వ్యాధిపై అవగాహన సదస్సు
యాపిల్ డయాగ్నస్టిక్ సెంటర్ లో టీబి వ్యాధిపై అవగాహన సదస్సు
ఎమ్మిగనూరు టౌన్, మార్చి 13, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివారం స్థానిక ఆపిల్ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ సూపర్వైజర్ మల్లికార్జున ,యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత కూరువ బీరప్ప, ఆధ్వర్యంలో టీ బి వ్యాధిపై ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ క్షయవ్యాధి (టీ బి) మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని బ్యాక్టీరియా సాధారణంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది, అయితే ట్యూబర్ క్యులోసిస్ బ్యాక్టీరియా మానవ శరీరంలోని మూత్రపిండాలు, వెన్నెముక మరియు మెదడు , ఇతర అవయవాలపై కూడా దాడి చేస్తుంది అని కాబట్టి ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మనిషి బతకడం కూడా కష్ట సాధ్యం అవుతుందని తెలిపారు. ఇంకా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 నుండి మార్చి 23 వరకు టీబీ వ్యాధి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని భారతదేశ ప్రభుత్వం ట్యూబర్‌క్యులోసిస్ (టీ బి ) వ్యాధిని పూర్తిగా అంతమొందించేందుకు టీబీ రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో రోగులకు ఉచితంగా గళ్ల పరీక్ష, ఉచితంగా మందులు మరియు, ప్రతినెల ఐదు వందలు రూపాయలు కేంద్ర ఆరోగ్య శాఖ ద్వారా అందజేయబడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, మరియు యాపిల్ డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది గణేష్ , నరసింహులు , మల్లికార్జున,ఆరోగ్య శాఖ కార్యకర్తలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.