ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ ఎల్లమ్మ దేవతను ప్రత్యేక పూజలు చేసిన కేఈ శ్యామ్ బాబు
తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 05, (సీమకిరణం న్యూస్) :
 
చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు అన్నారు. శుక్రవారం క్రిష్ణగిరి మండలంలోని లక్కసాగరం పంచాయితీ పరిధిలో ఉన్న లల్మాన్ పల్లి గ్రామంలో బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై కేఈ శ్యామ్ బాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ముందుగా లల్మాన్ పల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ ఎల్లమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి వైసిపి ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. యువతకి రైతులకు మంచి భవిష్యత్తు కావాలి అంటే అది బాబు వల్లే అవుతుందన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి మండలం చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మరియు లల్మాన్ పల్లి గ్రామ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!