
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్
జూనియర్ సహాయకులు మేరీ
వెల్దుర్తిలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 05, (సీమకిరణం న్యూస్) :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలని జూనియర్ సహాయకులు మేరీ అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు రమణారెడ్డి ఉమ్మన్న యల్లకృష్ణ మౌలాలి ప్రసాద్ బాబు అటెండర్ రవి వీఆర్ఏ హనుమన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.