ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 05, (సీమకిరణం న్యూస్) :
డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం అని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అన్నారు. వెల్దుర్తిలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళితుల ధ్రువతార డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాయకంటి గిడ్డయ్య, ఎం బజారు, జే .బజారు నాయకంటి. సుధాకర్ కే మోష పి. దేవదానం ఎన్ పెద్ద హరి, బాబి, ఎన్. ఏసు, ఆటో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.